దేశ్‌ముఖ్ రాజీనామా ఆమోదం
ముంబాయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విలాస్‌రావు దేశ్‌ముఖ్ చేసిన రాజీనామాను గవర్నర్ మొహమ్మద్ ఫజల్ శుక్రవారం ఉదయం ఆమోదించారు. దేశ్‌ముఖ్ తన రాజీనామా లేఖను గురువారం రాత్రి గవర్నర్‌కు పంపారు.
తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ దేశ్‌ముఖ్‌కు సూచించారు. ఈ రాజీనామాతో మూడేళ్ల విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ పాలన ముగిసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారు. గురువారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన షిండే శుక్రవారం కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్‌లతో కూడిన డెమొక్రటిక్ ఫ్రంట్ నేతగా ఎన్నికయ్యారు.
మొత్తం 289 మంది సభ్యులు గల శాసనసభ్యులలో కాంగ్రెస్ సభ్యులు 74 మంది కాగా నేషనలిస్టు కాంగ్రెస్ సభ్యులు 56 మంది.












Click it and Unblock the Notifications