పవర్లోకి వస్తే పవర్ ఒప్పందాలు రివైజ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీఅధికారంలోకి వస్తే తెలుగుదేశం ప్రభుత్వంకుదర్చుకొన్న అన్ని ప్రైవేట్ ఒప్పందాలనుసమీక్షించి, అవినీతి ఒప్పందాలను రద్దు చేస్తామనిసీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు.అవసరమైతే, తన కుమారుడికి చెందిన పవర్ ప్రాజెక్ట్‌ను కూడా జాతీయం చేస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం కరీంనగర్‌జిల్లాల్లో పాదయాత్ర కొనసాగిస్తోన్న వై.ఎస్. శనివారంనాటి ప్రజాప్రస్థానంలో ప్రజదర్బార్ లోప్రసంగించారు.
ప్రజల నుంచి అందినఫిర్యాదుల్లో అధికంగా విద్యుత్ కోతకుసంబంధించినవే కావడంతో ఆయనతెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్‌ఒప్పందాల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడిందోతెలుస్తుందన్నారు. రైతులకు విద్యుత్ ను అందించడంలోవిఫలమైన ఈ ప్రభుత్వానికి పరాజయం ఖరారైందన్నారు. తమ పార్టీకిచెందిన నాయకుడికి చెందిన లాంకోకంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలతో సహా అన్ని ఒప్పందాలనుతాము అధికారంలోకి వస్తే పునఃపరిశీలిస్తామనిఆయన స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వం పీపుల్స్‌వార్ నాయకులతో చర్చలను తిరిగి ప్రారంభించాలనిఆయన అభిప్రాయపడ్డారు. శనివారం నాడు కాస్తా వాతావరణంచల్లగా ఉండడంతో ఆయనహుషారుగా పాదయాత్రలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications