సిఎంను మట్టుబెట్టేందుకే దాడిః బొజ్జల
హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అంతమొందించేందుకే నక్సలైట్లు పకడ్బందీ పథకం వేశారని రాష్ట్ర ఇఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మందుపాతరలు పేలినప్పుడు ముఖ్యమంత్రితో పాటు కారులో ప్రయాణిస్తున్న బొజ్జల ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలుఅసమంజసంగా ఉంటే వాటి గురించి మాట్లాడాలి కానీ ఇలా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం అప్రజాస్వామికమని, అమానుషమని ఆయన అన్నారు.స్వల్ప గాయాలు తగిలిన గోపాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు చెప్పారు. చెన్నైలో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఇప్పుడిప్పుడే మాట్లాడగలుగుతున్నారు. నక్సలైట్ల దుశ్చర్యలనుఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications