సీఎం ఇంట్లోనే చికిత్స - విశ్రాంతి
హైదరాబాద్: మృత్యుంజడైబుధవారం రాత్రి అంతా తిరుపతిలోనే చికిత్సపొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కువిచ్చేశారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రత్యేకవిమానంలో ఆయన తిరుపతి నుంచి వచ్చారు. బేగంపేటవిమానాశ్రయంలో ఉదయం 10.30 గంటలకు అడుగుపెట్టారు.
విమానాశ్రయంనుంచి ఆయనను నేరుగా ప్రత్యేక అంబులెన్స్‌వాహనాల్లో జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహానికి తరలించారు. ప్రత్యేకవైద్యుల బృందం ఆయనకు చికిత్సచేస్తోంది. చంద్రబాబు నాయుడు పూర్తిగాకోలుకున్నారని, విశ్రాంతి తీసుకుంటున్నారని నిమ్స్‌డైరక్టర్ కాకర్ల సుబ్బారావు విలేకరులకు తెలిపారు.
ప్రముఖుల పరామర్శః సందేశాల వెల్లువ
హైదరాబాద్‌ః ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈనాడు అధిపతి రామోజీరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వామి కూడా ముఖ్యమంత్రిని కలుసుకుని ఆయన ఆరోగ్యపరిస్ధితిని తెలుసుకున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు చీవ్లు బారులాచంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకున్నారు.వచ్చిన వారందరీ కలుసుకోడానికి ముఖ్యమంత్రిఉత్సాహం చూపినా డాక్టర్లు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రికిమానసికంగా విశ్రాంతి అవసరమని డాక్టర్లుచెప్పారు. క్లియర్ చేయాల్సిన ముఖ్యమైనఫైళ్ళు ఉన్నాయి.
డాక్టర్లు అనుమతిస్తే ఈరోజే పనిలోకి వెళ్ళాలని ఉంది అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించినట్టు కొందరు మంత్రులుచెప్పారు. ముఖ్యమంత్రికి ప్రాణాపాయంతప్పినందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,గవర్నర్లు, కేంద్రమంత్రులు ఆయనకు పంపినసందేశాల్లో సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications