జాతీయ సంస్ధతో దర్యాప్తుః హోంమంత్రి
హైదరాబాద్‌ః ముఖ్యమంత్రిపై హత్యాయత్నం సంఘటనపై జాతీయ సంస్ధతో దర్యాప్తు జరిపిస్తామని హోంమంత్రి దేవేందర్ గౌడ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు డాక్టర్ సుబ్రమణ్యం సంఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని, ఢిల్లీ నుంచి నేషనల్‌సెక్యూరిటీ గార్డులు కూడా దర్యాప్తు పనిలో ఉన్నారని ఆయన గురువారంవిలేకరులకు వివరించారు.
సంఘటనా స్ధలంలోనే కాకుండా తిరుమల ఘాట్ రోడ్ లో ఇంకా అనేక చోట్ల నక్సలైట్లు మందుపాతరపెట్టినట్టు పోలీసులు కనుగొన్నారని ఆయన చెప్పారు. అడిషనల్ డిజిపి కుమావత్ పదిరోజుల్లో ఈ సంఘటనపై నివేదిక సమర్పిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి ఇప్పుడు జెడ్ ప్లస్‌సెక్యూరిటీ ఉంది. దీనిని ఇంకా పెంచే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications