దాడిపై సుబ్రమణ్యం దర్యాప్తు
హైదరాబాద్‌ః తిరుమలరోడ్డులో ముఖ్యమంత్రిపై హత్యాయత్నంవెనుక భద్రతా లోపాలమైనా ఉంటే వాటిపైదర్యాప్తు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంరిటైర్డు ఐపిఎస్ అధికారి డాక్టర్ సుబ్రమణ్యంకుఅప్పగించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు వ్యవస్ధాపకుడైన సుబ్రమణ్యం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భద్రతావ్యవహారాల సలహాదారుగా ఉన్నారు.
పోలీసుయంత్రాంగం లోటుపాట్లపై అనంతపురం డిఐజినారాయణ దర్యాప్తు చేస్తారని రాష్ట్ర డైరెక్టర్ జనరల్‌ఆఫ్ పోలీసు సుకుమార గురువారం ఇక్కడచెప్పారు. డాక్టర్ సుబ్రమణ్యం, నారాయణఇప్పటికే సంఘటనా స్ధలానికి చేరుకున్నారనిఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరంవెల్లడించారు. ముఖ్యమంత్రిపై దాడి పూర్వాపరాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మోహన్ కందా నేడు డిజిపిసుకుమార, ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజిపి శివశంకర్ తోచర్చించారు.
పీపుల్స్ వార్‌ను కార్యకలాపాలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికనురూపొందిస్తునట్టు సుకుమార చెప్పారు. ముఖ్యమంత్రికాన్వాయ్ లో జామర్ లేకపోవడం, కాన్వాయ్ లోఒకే నెంబరు కార్లు చాలా ఉండాలని, కానీ తిరుపతిలోఒకే కారును ఉపయోగించడం తదితర అంశాలపై కూడాదర్యాప్తు జరుగుతోందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications