పెట్రో ధరలపైభగ్గుమన్న బిజెపి నేతలు: లాఠీచార్జి
న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోలు,డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగాదేశవ్యాప్తంగాబిజెపి, దాని మిత్రపక్షాలు ఆందోళనకార్యక్రమాలు నిర్వహించాయి. ఢిల్లీలో ధర్నాచేసిన బిజెపి నాయకులపై పోలీసు లాఠీ చార్జి చేయగా బిజెపి ప్రధానకార్యదర్శి ముక్తార్‌అబ్బాస్ నక్వీ తదితర బిజెపి నాయకులు గాయపడ్డారు.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటివెళ్ళడానికి వీరు ప్రయత్నించగా మొదటపోలీసులుపైపులతో నీళ్ళు చల్లారు.
అయినావీరువెనుదిరగకపోవడంతో పోలీసులు లాఠీ చార్జిచేశారు. గాయపడిన నక్విని ఆస్పత్రిలో చేర్పించిచికిత్స చేయించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆందోళనచేస్తున్నతమపై లాఠీచార్జి చేయడం అన్యాయమని నక్వీవ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో కూడా పెట్రో, గ్యాస్‌ధరల పెంపునకు నిరసనగా టిడిపి, బిజెపిలుసంయుక్తంగా ధర్నా చేశాయి. సిపిఐకార్యకర్తలు కూడా నిరసన ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications
