తెలంగాణరాకపోతే, కేంద్ర సర్కారు పోతుంది: నరేంద్ర
సంగారెడ్డి:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతేకేంద్రంలో యుపిఎ ప్రభుత్వమేఉండదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖసహాయ మంత్రి, టిఆర్‌ఎస్ నాయకుడుఎ.నరేంద్ర వ్యాఖ్యానించారు. తెలంగాణరాష్ట్రం ఏర్పాటును వామపక్షాలువ్యతిరేకిస్తున్న మాట వాస్తవమేననిఆయన శనివారం ఇక్కడ అంగీకరించారు.
అరవై రెండుమంది లెఫ్ట్ ఎంపీలకు దీటుగా వామపక్షేతర, కాంగ్రెసేతరఎంపీలను తెలంగణకు అనుకూలంగా కూడగడతామని ఆయనచెప్పారు.డిసెంబర్‌లో జరిగే కేంద్ర మంత్రి మండలిసమావేశంలో ప్రత్యేకతెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టేలా చూస్తామనినరేంద్ర అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుప్రవేశపెట్టడానికి ఎన్ని నెలలైనా పట్టవచ్చని, కేబినెట్‌లోమాత్రం ఈతీర్మానం ఉండి తీరుతుందని ఆయనవివరించారు. కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌ఏర్పడే అవకాశం లేదన్నారు.












Click it and Unblock the Notifications
