చర్చలకుఎపికి స్వేచ్ఛ సరి కాదు: అద్వానీ
జైపూర్:నక్సలైట్లతో చర్చలు జరపడానికిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) కేంద్రప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడం సరి కాదనిభారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎల్.కె. అద్వానీ అన్నారు. నక్సలైట్లతోచర్చలు జరపాలనే యుపిఎ ప్రభుత్వనిర్ణయం పెద్ద తప్పు అని ఆయనఆదివారం విలేకరుల సమావేశంలోఅన్నారు.
నక్సలైట్లతోచర్చలు జరపాలనే నిర్ణయంపైపునరాలోచన చేయాలని ఆయన ప్రధానిడాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరారు.రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నక్సల్స్‌పైఒక విధానాన్ని రూపొందించాలని ఆయనకేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రాలడిజిపిలతో, ప్రధాన కార్యదర్శులతో,ఇంటలిజెన్స్ అధిపతులతో నక్సల్స్‌సమస్యపై చర్చించాలని కూడా ఆయనకేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.అంతర్గత భద్రతకు నక్సల్స్‌తోచర్చలు పెను విఘాతం కలిగించేఅవకాశం ఉందని ఆయనహెచ్చరించారు.











Click it and Unblock the Notifications
