తృతీయఫ్రంట్ వార్త కల్పితం: చంద్రబాబు
హైదరాబాద్:దేశంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటువార్తలను తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకొట్టిపారేశారు. దేశంలో తృతీయఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలుజరుగుతున్నాయని, ఇందులో చంద్రబాబుప్రధాన పాత్ర పోషిస్తున్నారని వార్తలువచ్చాయి.
తృతీయఫ్రంట్ ఏర్పాటు ఊహాగానం మాత్రమేనని,ఇందులో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ)ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలనువిస్మరిస్తోందని ఆయన విమర్శించారు.యుపి ఎ ప్రభుత్వం తప్పుల ప్రభావం ఆకూటమి భాగస్వామ్య పార్టీలపై కూడాపడుతుందని ఆయన అన్నారు. జాతీయప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) ప్రభుత్వపనుల ప్రభావం తమపై కూడాపడిందని, తాము ప్రభుత్వంలోచేరకుండా బయటి నుంచే మద్దతుఇచ్చినా తమపై కూడా ఆ ప్రభావం పడిందని,యుపి ఎ పనుల ప్రభావం దాని భాగస్వామ్యపార్టీలపై పడిందని ఆయన అన్నారు.నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లలలో రాష్ట్రప్రభుత్వంలోని పెద్దలు అక్రమాలకుపాల్పడుతున్నారని, రింగ్‌గా ఏర్పడిదోచుకు తింటున్నారని ఆయనవిమర్శించారు. ఈ విషయంలో తాము చేసినఆరోపణలకు ప్రభుత్వం జవాబు ఇవ్వడంలేదని, దీనిపై విస్తృత చర్చ జరగాల్సిఉన్నదని ఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
