కృష్ణానీటిపై మాటమార్చిన దివాకర్
విజయవాడ:కృష్ణా డెల్టాకు కృష్జా జలాలను ఇచ్చేవిషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రిజె.సి. దివాకర్ రెడ్డి మాట మార్చారు.కృష్ణాజలాలపై కృష్ణా డెల్టాకే హక్కువుంటుందని ఆయన ఆదివారంవిలేకరులతో అన్నారు.
కృష్ణాజలాలపై ఎగువ ప్రాంతాలకే హక్కువుంటుందని ప్రకటించిన దివాకర్ రెడ్డితీవ్ర ఒత్తిడి రావడంతో మాట మార్చారు.కృష్ణా జలాలపై కృష్ణా డెల్టాకు హక్కులేదని బుద్ధి ఉన్నవారెవరూ అనరనిఆయన అన్నారు. డెల్టాకు గోదావరి జలాలనుమళ్లిస్తున్నందున కృష్ణా జలాలఅవసరం ఉండదనే ఉద్దేశంతో తానుఅలా అన్నానని ఆయన అన్నారు. మూడు,మూడున్నర యేళ్లలో పోలవరంనుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకుమళ్లిస్తామని, దీనితో కృష్ణా డెల్టాకుకృష్ణా జలాల అవసరం ఉండదని, అందుకనితాను అలా అన్నానని ఆయన వివరణఇచ్చారు.











Click it and Unblock the Notifications
