జనశక్తికరీంనగర్ సభకు పోలీసుల దెబ్బ
కరీంనగర్:కరీంనగర్‌లో సిపిఐ (యంయల్)జనశక్తి బహిరంగ సభకు ఆదివారంపోలీసుల నుంచి అడుగడుగునా ఆటంకాలుఎదురయ్యాయి. కరీంనగర్ పట్టణాన్నిపోలీసులు చుట్టుముట్టారు. సభకువస్తున్న వాహనాలను విస్తృతంగాతనిఖీ చేశారు.
బహిరంగసభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.కోర్టు అనుమతి ఇచ్చిందని సిపిఐ(యంయల్) జనశక్తి నాయకుడుమంగన్న ప్రకటించారు. అయితే కోర్టుఆదేశాల ప్రతి తమకు అందలేదనిపోలీసులు బహిరంగ సభకు అనుమతినిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూసభను నిర్వహిస్తామని జనశక్తినాయకులు చెప్పారు. అయితే అనుమతిరాకపోవడంతో సభను ఒక హాల్‌లోసమావేశంగా నిర్వహిస్తామనిజనశక్తి నాయకులు చెప్పారు. ఆ హాల్‌నుంచి కూడా పోలీసులు అందరినీపంపించేశారు. దీంతో నక్సల్స్‌సానుభూతిపరులు వెనక్కివెళ్లిపోయారు. ఈ కారణంగాకరీంనగర్ పట్టణంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. సిపిఐ(యంయల్) జనశక్తి బహిరంగసభను రద్దు చేసుకుంది. పోలీసులువిఘాతం కలిగించడం వల్లనే సభనురద్దు చేసుకున్నట్లు జనశక్తి ప్రతినిధిచంద్రన్న చెప్పారు.











Click it and Unblock the Notifications
