మంచిర్యాలలోగని కూలి ఇద్దరు మృతి
ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆర్‌కె - 5బొగ్గు గని కూలి ఇద్దరు కార్మికులుమరణించారు. మరో ఐదుగురుగాయపడ్డారు. గాయపడిన వారినిరామకృష్ణాపురం ఆస్పత్రికితరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరిపరిస్థితి ఆందోళనకరంగాఉంది.
మరణించినకార్మికులను సాయిని సత్తయ్య,రామమోహన్ రావులుగా గుర్తించారు.శవాలను గనిలోంచి వెలికితీశారు.మందమర్రి, గోదావరిఖనిల నుంచి సహాయకబృందాలు వచ్చాయి. సింగరేణి జనరల్‌మేనేజర్ మనోహర్ రావు కూలినబొగ్గుగనిలోకి దిగి పరిస్థితిని పరిశీలించారు.యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనేప్రమాదం సంభవించిందని ఎ ఐటియుసిఆరోపించింది. మృతుల కుటుంబాలకు ఆరులక్షల రూపాయలేసి ఇస్తే తప్పశవాలను కదలనివ్వమని కార్మికసంఘాలు పట్టుబట్టి కూర్చున్నాయి.











Click it and Unblock the Notifications
