చిరంజీవి అల్లుడి పై మైనర్ బాలిక కిడ్నాప్ కేస్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను రహస్య వివాహం చేసుకున్న శిరీష్ భరద్వాజ్ పై 2002లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసు నమోదైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడనే ఆరోపణపై శిరీష్ భరద్వాజ్ ను 2002 మార్చి 30వ తేదీన హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం అతను బెయిలుపై విడుదలయ్యాడు.
కిడ్నాప్ నకు గురైన మైనర్ బాలిక వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. కిడ్నాప్ నకు గురైన బాలిక తండ్రి అరుణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పుడు పోలీసులు శిరీష్ ను అరెస్టు చేశారు. ఎస్.ఆర్. నగరులో కేసు నమోదైన మాట వాస్తవమేనని భరద్వాజ్ తండ్రి అంగీకరిస్తున్నట్లు కూడా టీవీ చానెళ్లు వార్తను ప్రసారం చేశాయి. ముషిరాబాద్, తదితర పోలీసు స్టేషన్లలో కూడా అతనిపై కేసులున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
