చంద్రబాబు వరాల జల్లు
విశాఖపట్నం: విశాఖపట్నం పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల సహకార రుణాలను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 25పైసలకే వ్యవసాయ రణాలను ఇస్తామని ఆయన చెప్పారు. సన్న, చిన్నకారు రైతులకు పది పైసల వడ్డీకే రుణసౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. పంటలకు మద్దతు ధర కోసం వేయి కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పేదలకు 3 సెంట్ల భూమిని, ఉచితంగా ఇళ్లను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. వికలాంగలకు, నిరుద్యోగులకు నెలకు వేయి రూపాయల భృతి కల్పిస్తామని ఆయన చెప్పారు. వృద్ధులకు 500 రూపాయల పింఛను ఇస్తామని ఆయన చెప్పారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications