తిరుపతిలో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
తిరుపతి: తిరుపతిలో బుధవారం ప్రారంభం కానున్న సీపీఐ రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ త్రైవార్షిక సమావేశాల్లో పార్టీభవిష్యత్ వ్యూహాలు, రాష్ట్ర సమితి కార్యవర్గం ఎంపిక జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ కార్యదర్శి ఏబీ బర్ధన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ రాఘవులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి ఈ సమావేశాల్లో లోతుగా చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీలో 125 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర సమితి ఎన్నిక, అందులో నుంచి 31 మందితో కూడిన కార్యవర్గం ఎంపిక, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల నియంత్రణా సంఘం ఎంపిక జరుగనుంది.












Click it and Unblock the Notifications