జుడాల మొండిపట్టు: అంతా చేశామన్న అరుణ
హైదరాబాద్: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రక్షణకు లిఖితపూర్వక హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. లిఖితపూర్వక హామీ ఇచ్చేది లేదని ఆరోగ్య మంత్రి గల్లా అరుణకుమారి చెప్పారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు భద్రత కల్పించడం సాధ్యం కాదని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జూనియర్ డాక్టర్ల భద్రతకు చేయాల్సిందంతా చేశామని, ఇక చేయాల్సిందేమీ లేదని ఆమె అన్నారు. సమ్మె విరమించాలని ఆమె జూనియర్ డాక్టర్లకు సూచించారు.
బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు ప్రత్యామ్మాయ అవుట్ పేషెంట్ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం సమ్మె విరమణ కాదని, పేదలకు తమ సమ్మె వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇది నిర్వహిస్తున్నామని జూనియర్ డాక్టర్లు అన్నారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తమ పిల్లలకు రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్ల తల్లిదండ్రులు అంటున్నారు. రక్షణ కల్పించకపోతే తమ పిల్లలు ఇంటి వద్దనే ఉండిపోతారని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications