మా అదుపులోనే రాజిరెడ్డి: డిజిపి
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లు రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఎస్.పి. యాదవ్ బుధవారం మానవ హక్కుల కమీషన్ ముందు చెప్పారు. రాజిరెడ్డి కేసుపై మానవ హక్కుల కమీషన్ విచారణ చేపట్టింది. రాజిరెడ్డిని కేరళలో అరెస్టు చేశామని, కోర్టులో హాజరు పరుస్తామని డిజిపి చెప్పారు.
రాజిరెడ్డిపై శ్రీపాదరావు హత్య కేసుతో పాటు 21 కేసులున్నాయి. రాజిరెడ్డి పోలీసుల అక్రమ అదుపులో ఉన్నాడని, ఆయనను, ఆయన భార్య సుగుణ అలియాస్ సంగీతను కోర్టులో వెంటనే హాజరు పరచాలని విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు వరవరరావు అన్నారు. రాజిరెడ్డిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజిరెడ్డికి, ఆయన భార్యకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications