కేరళ కోర్టులో రాజిరెడ్డి హాజరు
ఎర్నాకులం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లు రాజిరెడ్డి అలియాస్ సత్తెన్నను, ఆయన భార్య సుగుణ అలియాస్ సంగీతను పోలీసులు బుధవారంనాడు కేరళ కోర్టులో హాజరు పరిచారు. కేరళలోని ఎర్నాకులం జిల్లా ఆళువ మెజిస్ట్రేట్ కోర్టులో వారిని బుధవారం సాయంత్రం హాజరు పరిచారు.
రాజిరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కోరే అవకాశం ఉంది. రాజిరెడ్డిపై శ్రీపాదరావు హత్య కేసుతో పాటు 21 కేసులున్నాయని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటున్నారు. ఆయనను కరీంనగర్ జిల్లా మంథని కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. రాజిరెడ్డిని, సంగీతను ఎర్నాకులంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications