రామానాయుడికి హైకోర్టు నోటీసు
హైదరాబాద్: విశాఖపట్నంలోని రుషికొండలో స్టూడియో నిర్మాణంపై సినీ నిర్మాత రామానాయుడుకు హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి)కి కూడా హైకోర్టుల నోటీసు ఇచ్చింది. రుషికొండలో నిర్మాణాలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దాంతో హైకోర్టు ఆ నోటీసులు జారీ చేసింది.
రుషికొండలో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. దీనిపై కోర్టులో రిట్ దాఖలైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications