ఆరు ఆస్పత్రులకు భద్రత: సురేంద్రబాబు
హైదరాబాద్: హైదరాబాదులోని ఆరు ప్రభుత్వాస్పత్రుల్లో రక్షణ కల్పిస్తున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమీషనర్ సురేంద్రబాబు చెప్పారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, నిమ్స్, నయాపూల్, సుల్తాన్ బజార్ ఆస్పత్రుల్లో రక్షణ కల్పిస్తున్నట్లు ఆయన బుధవారంనాడు తెలిపారు. ఒక ఎస్సై స్థాయి అధికారితో సహా 20 మంది సాయుధ కానిస్టేబుళ్లను రక్షణకు నియమించనున్నట్లు ఆయన తెలిపారు. ఏ విదమైన అభద్రతకు లోను కాకుండా జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కావచ్చునని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, జూనియర్ డాక్టర్లను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వార్డెన్ల చేత జూనియర్ డాక్టర్లకు నోటీసు ఇప్పించింది. ఖాళీ చేయించడానికి కొంత మంది పోలీసు భద్రతను కోరారు. కాగా, జూనియర్ డాక్టర్లను హోంమంత్రి కె. జానారెడ్డి చర్చలకు ఆహ్వానించారు. భద్రతకు సంబంధించి ఆయన జూనియర్ డాక్టర్లకు కచ్చితమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications