వైయస్ కు చెప్తాం: ఎమ్మెస్సార్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి తమ పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి ఇచ్చే విందులో తెలంగాణపై స్పష్టంగా చెప్తామని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. పార్టీ బతకాలంటే 2009లోగా తెలంగాణ ఇవ్వాలని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్తామని ఆయన అన్నారు.
విందు చర్చల్లో ముఖ్యమంత్రి నుంచి ఏ విధమైన సూచనలు వస్తాయో చూస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వాల్సింది తమ పార్టీ అధిష్ఠానవర్గమే అయినా ముఖ్యమంత్రికి కూడా బాధ్యత ఉందని ఆయన అన్నారు. మంత్రి టి. జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications