చంద్రబాబు మేడారం పర్యటన వివాదం

రెండు రోజుల క్రితమే చంద్రబాబు పర్యటన ఖరారైందని, చంద్రబాబు మేడారం పర్యటనను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి పేషీ కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి వచ్చి పోయిన తర్వాత గానీ, ముఖ్యమంత్రి రావడానికి ముందు గానీ చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అడిగామని, అందుకు కూడా అధికారులు అంగీకరించడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు మేడారం పర్యటనను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి పేషీ కుట్ర చేస్తుందనే విమర్శ నీచాతినీచమైందని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పర్యటించకుండా ప్రభుత్వం చంద్రబాబును ఎప్పుడైనా అడ్డుకుందా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications