మనో వేగంతో అవినీతి: దేవేందర్
హైదరాబాద్: అవినీతిలో ప్రభుత్వం మనోవేగంతో సాగుతోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. బడ్జెట్ పై చర్చలో భాగంగా ఆయన శుక్రవారం శాసనసభలో ప్రసంగించారు. ప్రభుత్వ జలయజ్ఞం అవినీతికి, అక్రమాలకు ఆలవాలంగా మారిందని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో 400 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని కాగ్ నివేదికలో చెప్పారని, తాము ఆరోపిస్తున్నామని ఆయన అన్నారు. లోకాయుక్త నివేదికను శాసనసభలో ఎందుకు పెట్టడంలేదని ఆయన అడిగారు.
మద్యం ఆదాయంతో ఖజానా నింపి అభివృద్ధి సాధించామని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి అంతా ఉత్తదేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా మార్చారని తమపై ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విమర్శించిందని, కాంగ్రెస్ చేస్తున్నదేమిటని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు ప్రభుత్వం అవినీతి ఊబిలోకి నెడుతోందని, 63 వేల కోట్ల అప్పులు చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications