రాష్ట్రమంతా రెఫరెండం: జెసి

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్రమంతటా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై రెఫరెండం జరపాలన్న కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి ప్రకటనపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కొందరు గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారని, కొందరు తమిళనాడులో కలపాలంటున్నారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లావాళ్లు తాము కర్ణాటకలో కలుస్తామంటున్నారని, ఉత్తర కోస్తా కావాలని కొందరంటున్నారని, ఇవన్నీ తేలాలంటే రాష్ట్రమంతటా రెఫరెండం జరగడం అవసరమని ఆయన అన్నారు.

రాష్ట్రంలో రెఫరెండం జరిగిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని రోడ్లు భవనాల మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై హైదరాబాద్ లో ప్రజాభిప్రాయం జరపకుండా ఎలా నిర్ణయం చేస్తామని ఆయన అడిగారు. తెలంగాణపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు లేవని ఆయన అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి వస్తుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+