పిసిసి నేత పేరు త్వరలో : వీరప్ప మొయిలీ
న్యూఢిల్లీ: పిసిసి అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఇక ఏ మాత్రం జాప్యం జరగదని, ఏ క్షణంలోనైనా నిర్ణయం వెలువడవచ్చని, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ చెప్పారు. మరికొందరు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులతో పాటు ఆయన సోనియా గాంధీని కలుసుకున్నారు.
ఇలా ఉండగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక విషయంలో సోనియా గాంధీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట దాటి పోరని స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీకి నష్టం రాదనుకుంటే, వైఎస్ చెప్పిన ఏ పేరునైనా పిసిసి అధ్యక్ష పదవికీ పరిశీలించి, ప్రకటించే అవకాశముంది.












Click it and Unblock the Notifications