వైయస్ తో భేటీ కీలకమే: ఉప్పునూతల
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి ఇంట్లో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో జరిపే సమావేశం కీలకమైందేనని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కాకా నివాసంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. 2009లోగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని పురుషోత్తమ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రే చొరవ చూపాలని ఆయన మరోసారి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ద్వారా వస్తే మంచిదని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి సభ ద్వారా తెలంగాణ సెంటిమెంటును చాటుతామని ఆయన చెప్పారు. ఈ నెల 24వ తేదీన ఈ సభ జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సభ రద్దు కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అడిగితే రాష్ట్రమంతటా రెఫరెండం కోరవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications