మళ్లీ తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు మరోసారి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెరాస సభ్యులు శుక్రవారం శాసనసభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో తెరాస సభ్యులను స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలపై తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టిడిపి సభ్యులు కూడా ఆందోళనకు దిగారు.
నిరర్ధక భూములు అమ్మితే నొప్పా అని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు నాయని నర్సింహా రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణకు చెందిన భూములు అమ్మితే తమకు నొప్పేనని ఆయన అన్నారు. ఆంధ్ర భూములు లేదంటే రాయలసీమ భూములను అమ్ముకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్, హైదరాబాదు చట్టుపక్కల ఉన్న భూములను అమ్మి బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ముఖ్యమంత్రి కుతంత్రం చేస్తున్నారని ఆయన విమర్శించారు. భూములను ధరలను కోట్ల రూపాయలకు పెంచి సామాన్యులకు ప్లాటు కూడా అందుబాటులో లేని స్థితి కల్పించారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications