సోనియాతో మాట్లాడుతా: వీరప్ప మొయిలీ
గుంటూరు/ ఒంగోలు: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల రుణాల మాఫీపై తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చిస్తానని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వరద తాకిడి ప్రాంతాలను ఆయన బుధవారంనాడు సందర్శించారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని ఆయన హామీ ఇచ్చారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అదనపు సహాయం అందేలా చూస్తానని ఆయన చెప్పారు. బాధిత రైతులను కేంద్రం కూడా ఆదుకుంటుందని ఆయన చెప్పారు. తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు ఇచ్చే ప్రయత్నాలకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారని, రాజశేఖర రెడ్డి రైతుల మిత్రుడని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటారని ఆయన చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుసున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications