దాసరి కొడుకు కిడ్నాప్: ఒకరి అరెస్టు
చిత్తూరు: సినీ దర్శక నిర్మాత, కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తాకర హరిహర ప్రభు అలియాస్ ప్రభు కిడ్నాప్ కేసులో పోలీసు దివాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మణి అనే వ్యక్తిని విచారించిన అనంతరం దివాకర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభును భార్య, కొడుకులతో చిత్తూరులోని ఒక లాడ్జి నుంచి ఆగంతకులు బలవంతంగా లాక్కెళ్లారు. ఈ కిడ్నాప్ వెనక అత్తామామల పాత్ర ఉండవచ్చునని ప్రభు భార్య సుశీల అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల ప్రాంతంలో మణి అనే వ్యక్తి లాడ్జికి వచ్చి ప్రభును పిలిచాడు. ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతూ బయటకు వచ్చిన ప్రభును దుండగులు బలవంతంగా లాక్కెళ్లారు. సుశీలను, కుమారుడిని గదిలో ఉంచి బయట నుంచి మణి గొళ్లెం పెట్టాడు. ఈ విషయాన్ని సుశీల పోలీసులకు ఫిర్యాదులో తెలియజేసింది.
తమకు శత్రువులు ఎవరూ లేరని, ఇదే తమ అత్తామామల పనే అయి ఉంటుందని సుశీల అంటున్నారు. తమ పెళ్లి తమ అత్తామామలకు ఇష్టం లేదని, అందుకే ఈ పనికి పూనుకుని ఉంటారని ఆమె అన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు కిడ్నాప్ నకు గురైన పోలీసులు ప్రతిస్పందించడం లేదని ఆమె విమర్శించారు. సుశీల ప్రకటనల్లో కూడా పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి.












Click it and Unblock the Notifications