టిడిపి ఎమ్మెల్సీల నిరసన వ్రతం
హైదరాబాద్: తెలుగుదేశం శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) బుధవారం మౌనవ్రతం పూనారు. నోళ్లకు నల్లటి వస్త్రాలు కట్టుకుని చైర్మన్ చక్రపాణి పోడియం వద్ద బైఠాయించారు. మంగళవారం చక్రపాణి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ఈ ప్రదర్శనకు పూనుకున్నారు. చక్రపాణి కాంగ్రెస్ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం శాసమండలి నాయకుడు దాడి వీరభద్రరావు విమర్శించారు. దీంతో తెలుగుదేశంపై కాంగ్రెస్ సభ్యులు మంగళవారం విమర్శలు చేశారు. అదే రకమైన విమర్శలు చక్రపాణి చేశారు. దీంతో తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు.
చైర్మన్ గా తాను న్యాయమూర్తిలాంటివాడినని, ప్రతి ఒక్కరికీ లక్ష్మణ రేఖలు ఉంటాయని చైర్మన్ చక్రపాణి అన్నారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ ప్రదర్శనను వీడలేదు. దీంతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జోక్యం చేసుకుని దాడి వీరభద్రరావుతోనూ, ఇతర నాయకులతోనూ చర్చలు జరిపారు. తాను సరదాగా అన్న మాటలను తీవ్రంగా తీసుకోవద్దని చక్రపాణి తెలుగుదేశం సభ్యులతో చెప్పారు. దీంతో తెలుగుదేశం సభ్యులు శాంతించారు. సభ సజావుగా సాగింది.












Click it and Unblock the Notifications