గిరిజనులతో చంద్రబాబు నృత్యం
హైదరాబాద్: ఎప్పుడూ రాజకీయాల్లో తలమునకలవుతూ, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ఉండే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. గిరిజన మహిళలతో కలిసి హోలీ ఆడారు. తెలుగు ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రమేష్ రాథోడ్ గిరిజనులతో కలిసి చంద్రబాబు ఇంటికి వచ్చారు. వారితో కలిసి చంద్రబాబు హోలీ ఆడారు. గిరిజనుల కోరిక మేరకు వారితో కలిసి కాసేపు నృత్యం చేశారు. ఒంటిపై రంగులు పోయించుకున్నారు.












Click it and Unblock the Notifications