కోర్ కమిటీ సాయంత్రం: ఢిల్లీలోనే కాకా
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరుగుతుంది. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో పాటు సోనియా గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో జి. వెంకటస్వామి, కె.ఆర్. అమోస్ ఢిల్లీలోనే ఉండిపోయారు.
కోర్ కమిటీ సమావేశం నిర్ణయాలను బట్టి సీనియర్లు భువనగిరిలో తలపెట్టిన తెలంగాణ రణభేరీ సభ భవిష్యత్తు తేలిపోవచ్చు. ఈ సభ జరుగుతుందని శుక్రవారం హైదరాబాదు వచ్చిన సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని పక్కన పెట్టి రక్షణ మంత్రి ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కాంగ్రెస్ సీనియర్లతో చర్చలు జరిపారు. సోనియా గాంధీ సీనియర్లతో గంటకుపైగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications