భువనగిరి ఆహ్వానం లేదు: డిఎస్

నిజామాబాద్: కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లు ఈ నెల 24వ తేదీన తలపెట్టిన భువనగిరి సభకు తనకు ఆహ్వానం అందలేదని, ఆహ్వానం వస్తే హాజరయ్యే విషయంపై ఆలోచిస్తానని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రజలు మనోభావాలకు అనుగుణంగా తెలంగాణపై 2009లోగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంటుకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.

తాను చెప్పే వరకు భువనగిరి సభ రద్దు కాదని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. సభను రద్దు చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు చేసిన సూచనపై ఆయన మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు అన్యాయం చేశారో, లేదో భువనగిరి సభ తర్వాత చెప్తామని ఆయన హైదరాబాదులో అన్నారు. తమకు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ దొరకకపోతే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణకు బాగుండేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+