ఉప ఎన్నికల తర్వాతే టిడిపి తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణపై ఉప ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండో రోజు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించామని పార్టీ నాయకులు చెప్పారు. కొత్త పార్టీలు చాలా వస్తున్నందున ఆ పార్టీల నిర్ణయాల కోసం వేచి చూడాలని పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. ఇటీవలి పార్టీ తెలంగాణ నాయకుల సమావేశం గురించి చంద్రబాబు ఆరా తీశారు. చిరంజీవి పెట్టబోయే పార్టీ గురించి సమావేశంలో చర్చించారు.
పార్టీపై అసంతృప్తితో ఉన్న కోటగిరి విద్యాధరరావును పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పార్టీ నాయకుల సూచన మేరకు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన కోటగిరికి ఆహ్వానం పంపారు. చంద్రబాబుతో తనకు విభేదాలు ఉన్నాయని కోటగిరి విద్యాధరరావు బహిరంగంగానే చెప్పిన చెప్పారు. ఈ విషయంపై ఆయన చింతలపూడి నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో మాట్లాడారు కూడా.












Click it and Unblock the Notifications