భువనగిరి సభ రద్దుకు విహెచ్ సూచన
హైదరాబాద్: నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ నెల 24వ తేదీన తలపెట్టిన తెలంగాణ రణభేరీ సభను రద్దు చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లకు సూచించారు. తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని, అందువల్ల భువనగిరి సభను రద్దు చేసుకోవడమే మంచిదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాంగ్రెసుకు పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉంటే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి వుండేవారని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి సోనియా అన్ని విషయాలు తెలుసుకున్నారని, దాంతో కోర్ కమిటీ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications