తెరాసకు దమ్ముల్లేవు: విజయశాంతి
వరంగల్లు: తనను ఎదుర్కునే దమ్ము లేకనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తల్లి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అనంతరం ఆమె వరంగల్లు జిల్లా చేర్యాల శాసనసభా నియోజకవర్గం నుంచి తన పోరుబాటను ప్రారంభించారు. తనను కాంగ్రెస్ ఏజెంటుగా అభివర్ణించడాన్ని ఆమె మీడియా ప్రతినిధుల వద్ద తప్పు పట్టారు.
మంత్రి పదవులు తీసుకున్న తెరాస కాంగ్రెస్ ఏజెంటుగా వ్యవహరించిందా, ఏ పదవి తీసుకోని తాను ఏజెంటుగా వ్యవహరించానా అని, ఈ విషయం తెరాస నాయకులను అడగాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గడువులు పెడుతూ తెరాస ప్రజలను మోసం చేసిందని ఆమె విమర్శించారు. తాను బిజెపి నుంచి బయటకు వచ్చి తెలంగాణ కోసం పోరాడుతున్నానని, పదవుల కోసం పోరాడడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications