చంద్రబాబు ఉచిత హామీలు

గుంటూరు: తాము అధికారంలోకి వస్తే మహిళలకు గ్యాస్ కనెక్షన్, గ్యాస్ స్టౌ ఉచితంగా ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పేదలకు ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా తక్కువ ధరకు గ్యాస్ ను సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. మీ కోసం యాత్రలో భాగంగా ఆయన సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఈ యాత్రలో తీవ్రంగా ధ్వజమెత్తారు. నిత్యావసర ధరల పెరుగుదలకు, ప్రత్యేక తెలంగాణకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలే కారణమని ఆయన విమర్శించారు.

మిర్చి రైతులు 300 కోట్ల రూపాయల మేరకు నష్టపోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. మిర్చి రైతుల కోసం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేస్తామని ఆయన మరోసారి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+