సొమ్మసిల్లి మరణించిన కానిస్టేబుల్ అభ్యర్థి
వరంగల్: కానిస్టేబుల్ నియామకాల కోసం జరిగిన పరుగు పోటీలో ఒక అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయి సోమవారం మృతి చెందాడు. మరో అభ్యర్థి స్పృహ తప్పి పడిపోయి వరంగల్లులోని ఎంజిఎం అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ శారీరక దృఢత్వ పరీక్షల కోసం వచ్చిన అభ్యర్థులను పది బ్యాచులుగా విడగొట్టి పరీక్షలు నిర్వహించారు. పరుగు పోటీల సందర్భంగా వరంగల్లు జిల్లా జగ్గన్నపేటకు చెందిన రౌతు నరేందర్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఎంజిఎం అస్పత్రికి తరలించారు.
అస్పత్రికి చేరుకునే లోగానే అతను మరణించాడు. పరుగు మధ్యలో నీళ్లు తాగడం వల్లనే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వరంగల్లు జిల్లా హసన్ పర్తి మండలం భీమారం గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతున్నాడు. విషయాన్ని జిల్లా కలెక్టర్ కు తెలియజేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications