ఇద్దరు సిపిఎం అభ్యర్థుల ఖరారు
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో రెండు శాసనసభా నియోజకవర్గాలకు సిపిఎం తన అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాదులోని ముషీరాబాద్ నుంచి సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎస్. వీరయ్య పేరును, వరంగల్లు జిల్లా చేర్యాల నుంచి సీనియర్ నేత ఎ. మల్లారెడ్డి పేరును సిపిఎం నాయకత్వం ఖరారు చేసింది. అయితో పొత్తులపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సమదూరం పాటించాలని సిపిఐ నిర్ణయం తీసుకోవడంతో సిపిఎం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే విషయంలో సందేహంలో పడింది.
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే కాలంలో చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ విధమైన అవకాశం ఉంటుందనే విషయాన్ని సిపిఎం తవ్రంగా పరిశీలిస్తోంది. రేపు కోల్ కత్తాలో జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారు. ఉప ఎన్నికల్లో మరో రెండు మూడు స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో కూడా సిపిఎం ఉన్నట్లు సమాచారం. తాను పోటీ చేయని చోట సిపిఐకి మద్దతు ప్రకటించి తెలుగుదేశంతో దూరంగానే ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా పార్టీ పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications