చెన్నై సమీపంలో వాయుగుండం
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకి 500.కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం మరింత బలపడి ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని తుపాను కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడు కాస్తా పెద్ద వర్షాలు పడే అవకాశం ఉంది. వాయుగుండం తుఫానుగా మారి మరింత బలపడే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నంలలో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు తుపాను కేంద్రం అధికారులు తెలిపారు. కాకినాడ రేవులో సెక్షన్ సిగ్నల్ ఐదుతో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు అధికారులు వెల్లడించారు. మరో 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications