కెసిఆర్ పై మాట్లాడను: డిఎస్
విజయవాడ: హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై తానేమీ మాట్లాడదలుచుకోలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకున్నట్లున్నదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వ అవినీతిపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలను పట్టించుకోనవసరం లేదని ఆయన అన్నారు.
ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009 సాధారణ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుపై రెఫరెండం అంటే అంగీకరించడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని, అయితే ఉప ఎన్నికలు మాత్రం రెఫరెండం కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఎజెండాపై అంతటా ఎన్నికలు జరిగితేనైనా రెఫరెండంగా భావించవచ్చునని, పరిస్థితి అలా కూడా లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications