కెసిఆర్ సొత్తు కాదు: ఎమ్మెస్సార్
కరీంనగర్: తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సొత్తు కాదని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు అన్నారు. ఇందుకు ఆయన చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైన కథను చెప్పారు. తెలంగాణ అంశాన్ని తాము లేవనెత్తితే చంద్రశేఖరరావు సొంతం చేసుకున్నారని ఆయన సోమవారంనాడు అన్నారు.
తెలంగాణకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ ను ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెరాస పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రాజీనామాలు చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications