నోట్ల కట్టలు మింగిన ఎస్సై
హైదరాబాద్: హైదరాబాదులోని హుమాయున్ నగర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్సెపెక్టర్ (ఎస్సై) చంద్రకిరణ్ రెడ్డి ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను మింగేశారు. సోమవారంనాడు ఈ సంఘటన పోలీసు స్టేషనులో జరిగింది. అవినీతి నిరోధక శాఖ (ఎసిపి) అధికారులకు భయపడి ఆయన నోట్ల కట్టలను మింగేశారు. వెంటనే ఆయనను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టారు.
ఒక వరకట్నం కేసులో చంద్రకిరణ్ పది వేల రూపాయల లంచం అడిగారు. చివరకు బేరమాడి నాలుగు వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇరు పక్షాల మధ్య గొడవ చెలరేగింది. దీంతో లంచం ఇవ్వజూపిన వ్యక్తులు విషయాన్ని ఎసిబి అధికారులకు అందజేశారు. వెంటనే ఎసిబి అధికారులు రంగప్రవేశం చేశారు. ఎసిబి అధికారులను చూసిన ఎస్సై నోట్ల కట్టలను మింగేశాడు.












Click it and Unblock the Notifications