సిరీస్ ఘటనపై వెల్లువెత్తిన నిరసన
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని సిరీస్ కర్మాగారం సంఘటనపై సోమవారం నిరసన వెల్లువెత్తింది. సిరీస్ ఫ్యాక్టరీ సంఘటనను నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆందోళనకు దిగారు. ఆదివారం సాయంత్రం సిరీస్ మందుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదవం చెలరేగి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
సిరీస్ ఫ్యాక్టరీ ఎదురుగా బైఠాయించి రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు లోనికి రాకుండా గేటుకు తాళం వేశారు. సిరీస్ కు చుట్టుపక్కల నాలుగైదు కీలోమీటర్ల మేర రసాయనాలతో కూడిన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి కారణమైనవారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications