8 ఏళ్ల బాలుడి కిడ్నాప్, హత్య
హైదరాబాద్: చిన్నపాటి గొడవ ఎనిమిదేళ్ల బాలుడి హత్యకు దారి తీసింది. ఆదివారం మధ్యాహ్నం అపహరణకు గురైన ఆకాష్ అనే ఎనిమిదేళ్ల బాలుడు అత్తాపూర్ లో శవమై కనిపించాడు. సతీష్ అనే ఆటోడ్రైవర్ ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి శవం అత్తాపూర్ లోని వంతెన కింద కనిపించింది.
సతీష్ కు టోలీచౌక్ కు చెందిన ఆకాష్ తండ్రి ఆటో అద్దెకు ఇచ్చాడు. అద్దె సరిగా చెల్లించకపోవడంతో అతన్ని ఆకాష్ తండ్రి మందలించాడు. దీంతో సతీష్ ఆకాష్ ను కిడ్నాప్ చేసి హతమార్చాడు. బాలుడి గొంతు నులిమి చంపి ఆ తర్వాత తలపై బండరాయితో మోదినట్లు తెలుస్తోంది. బాలుడి శవంపై బ్లేడుతో కోసిన గుర్తులు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications