పోలీసుల పేరుతో తండ్రీకూతుళ్ల కిడ్నాప్
విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో తండ్రీకూతుళ్లు అపహరణకు గురయ్యారు. పోలీసులమని చెప్పి దుండగులు వారిని తీసికెళ్లారు. తాము పెనమలూరు పోలీసు స్టేషను నుంచి వచ్చామని, ఒక విచారణ కోసం రావాలని జీవనలక్ష్మి అనే వివాహితను వారు చెప్పారు. దాంతో ఆమె వెంట తండ్రి సీతారామయ్య కూడా బయలుదేరాడు. వారు ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ కేసు నమోదు చేసి కిడ్నాపర్ల ఆచూకీ కోసం పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. జీవనలక్షి భర్త వ్యాపార భాగస్వాములే ఈ కిడ్నాప్ నకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులోని చిట్ ఫండ్ కంపెనీలో జీవన లక్ష్మి భర్త స్లీపింగ్ భాగస్వామిగా ఉన్నాడు. కిడ్నాపర్లు క్వాలిస్ వాహనంలో వచ్చారు.












Click it and Unblock the Notifications