ముగ్గురు జనశక్తి నక్సల్స్ హతం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సోమవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జనశక్తి నక్సలైట్లు మరణించారు. తునికాకు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకునేందుకు నక్సలైట్లు వస్తున్నారని సమాచారం అందడంతో టేకులపల్లి అటవీ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

మృతి చెందిన నక్సలైట్లను జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు దయా, నాగార్జున, కిషన్ లుగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు 8 ఎంఎం పిస్టళ్లను, ఒక టోల్ బోర్ గన్నును, కార్బయిడ్ ను, 30 తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+