గోల్డ్ క్వెస్ట్ గుట్టు రట్టు
చెన్నై: చెన్నైలోని గోల్డ్ క్వెస్ట్ మార్కెటింగ్ సంస్థ గుట్టు రట్టయింది. పోలీసులు ఈ సంస్థ నుంచి 9 కోట్ల రూపాయల విలువ చేసే గోల్డ్ కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే గోల్డ్ కాయిన్స్ ఇస్తామని, వాటికి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని విలువ ఉంటుందని హాంకాంగ్ కు చెందిన ఈ కంపెనీవారు చెప్పారు. దీంతో ప్రజలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే తమకు గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు.
గోల్డ్ క్వెస్ట్ లో పెట్టుబడులు పెట్టకూడదని పోలీసులు పలుసార్లు ప్రజలను హెచ్చరించారు. ఈ సంస్థలో చెన్నైలో స్థిరపడిన ఒక తెలుగు సినీ ప్రముఖుడి కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సంస్థలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగైదు లక్షల మంది పెట్టుబడులు పెట్టారు.












Click it and Unblock the Notifications