నిర్మాత నిఖిల్ రెడ్డి ఆఫీసుపై దాడి
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి ఎన్ కౌంటరుతో తెర మీదికి వచ్చిన సినీ నిర్మాత నిఖిల్ రెడ్డి కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. అయితే సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తన మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు చేస్తారని నిఖిల్ రెడ్డి అంటున్నారు. దుండగులు కార్యాలయంలోని ఫర్నీచర్ ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. కీలకమైన పత్రాలు ఎత్తుకెళ్లారు.
దాడి చేసింది సహ నిర్మాత అభినవ్ రెడ్డి మనుషులా, గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి మనుషులా అనేది తెలియడం లేదు. ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు మొదలు పెడతామని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు మాత్రం నిఖిల్ రెడ్డి కార్యాలయానికి వచ్చారు. అభినవ్ రెడ్డితో వచ్చిన విభేదాలతో అజీజ్ రెడ్డి తనను బెదిరించాడని నిఖిల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అజీజ్ రెడ్డి ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications